Sruthi Sourabham    Chapters    Last Page

ఎందరో మహానుభావులు...

ఈ శ్రుతి సౌరభం నలుదిక్కులా వ్యాపించడానికి ఆర్థిక సహకారం ప్రసాదించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి,

నా రచనలు వెలుగులోకి రావడానికి అనుక్షణం ప్రోత్సహిస్తున్న మిత్రులు నైష్ఠికులు బ్రహ్మశ్రీ అరిపిరాల సీతారామయ్యగారికి,

ఈ గ్రంథాన్ని చూచి తమ అమూల్యమైన అభిప్రాయాన్ని ఇచ్చిన మహామహోపాధ్యాయ రాష్ట్రపతి పురస్కారగ్రహీత, సాఙ్గస్వాధ్యాయ భాస్కర, వేదభాష్యరత్నాకర, మీమాంసావిద్యాప్రవీణ, శాస్త్రనిధి, స్మార్తాచార్య బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణ మూర్త్యవధానులుగారికి,

ఈ వ్యాసాలను చదివి, అవి ఆంగ్లభాషలోనికి పరివర్తితం కావాలని రెండువేల రూపాయల విరాళంతో మఙ్గళాశాసనం చేసిన ద్వాదశ భాషాపండితులు, సుకవి, త్రిపురసుందరీ ప్రతిష్ఠాన వ్యవస్థాపకులు, అమెరికాలోని హిందూ సంఘ సాంస్కృతిక కేంద్ర పరిపాలనాధికారి ఆచార్య కోట సుందరరామశర్మగారికి, భారతీయ సంస్కృతీ ప్రీతితో అస్పష్టంగా ఉన్న మహాదేవ ముద్రికను, హయగ్రీవ ముద్రికను చిత్రాలుగా గీయించి, శ్రుతి సౌరభం 3వ భాగం ముద్రణకు ఆర్థిక సహకారం చేసిన గోపి గోల్డ్‌ ప్లేటింగ్‌ వర్క్స్‌ అధినేత వదాన్యులు శ్రీ మహంకాళి సత్యనారాయణగారికి,

నా పరిశోధన వ్యాసంగాన్ని ప్రోత్సహిస్తూ నా కృషిని అభినందిస్తున్న ఆంధ్ర జాతీయ కళాశాల పాలకవర్గం ఆంధ్రజాతీయ విద్యాపరిషత్తు, మచిలీపట్టణం వారికి, నాల్గు సంవత్సరాలుగా మా కుటుంబారోగ్యాన్ని కాపాడుతూ, వేదభాష్యశ్రవణం చేయడం ద్వారా నా పరిశోధన వ్యాసంగానికి పరోక్షంగా తోడ్పడిన డాక్టర్‌ జ్యోస్యుల కాళిదాసుగారికి, దీనిలోని చారిత్రక వ్యాసాలను ఆంగ్లంలోకి పరివర్తనం చేసి తమ విశిష్టాభిప్రాయాన్నిచ్చి ప్రోత్సహించిన ప్రముఖ చరిత్ర విద్వాంసులు, శ్రీ పద్మావతీ మహిళా హిందూకళాశాల ప్రాచార్యులుగా పనిచేసి విశ్రాంతినందిన శ్రీ సర్వారామమోహనప్రసాద్‌, M.A., Phil., గారికి,

భారతీయ సంస్కృతిపై అభిమానంతో, హరప్పా సంస్కృతిలో వేదసంస్కృతి అనే వ్యాసాన్ని విడిగా ప్రచురించి పలువురు ప్రముఖులకు పంచిపెట్టిన దేవీపూజాధురంధరులు, వదాన్యులు బ్రహ్మశ్రీ కోట సీతారామశాస్త్రిగారికి,

ఈ వ్యాసాన్ని తమ పత్రికలలో ప్రచురించిన శ్రీవాణి పత్రికా సంపాదకులు శ్రీ కొమరగిరి కృష్ణమోహనరావుగారికి, ఆంధ్రప్రభ సాంస్కృతిక విలేఖరి శ్రీ ముదిగొండ శాస్త్రిగారికి,

ఈ గ్రంథం భారతదేశ ప్రముఖులకు చేరడానికి ఆర్థిక సహకారమిచ్చిన చిట్టిగూడూరు నారసింహ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీ భారతం శ్రీమన్నారాయణగారికి (రిటైర్డ్‌) హృదయపూర్వక ధన్యవాదాలు.

భారతీయ సంస్కృతమీది అభిమానంతో ఈ గ్రంథం వెలుగులోకి రావడానికి మార్గాలు వెదకి, దీనిని సుందరంగా తీర్చిదిద్దుతున్న శ్రీ తేజశ్రీ షిరిడీ ప్రింటర్స్‌ అధినేత శ్రీ సిహెచ్‌. సాయిబాబా గారికి, పశుపతి దేవుని ముద్రికకు, హయగ్రీవ ముద్రికకు అందమైన ఊహాచిత్రాల నందించిన కళాకారుడు శ్రీ టి. భాస్కర్‌గారికి నా కృతజ్ఞతలు.

అల్లిబిల్లిగా ఉండే నా రాతకు సహనంతో స్పష్టంగా, సుందరంగా సాపుప్రతిని సమకూర్చి సహకరిస్తున్న నా అర్ధాంగి చి.సౌ. కృష్ణవేణికి శుభాశీస్సులు.

- రచయిత

Sruthi Sourabham    Chapters    Last Page